Skip to main content

మార్పు

ఈమధ్యనే ఒక పెళ్ళికి వెళ్ళాను . అసలు పెళ్లి తతంగం అంత చాల మారిపోయింది. వెళ్ళినప్పటి నుంచి వచీదాక నేను చూసిన కొన్ని దృశ్యాల సమాహారమే ఈ చిట్టి వ్రాత .
అసలు పెళ్లి మండపం లో పెళ్లి వారు , వారి బంధు మిత్రుల కంటే , కొత్త చుట్టాలు ఎక్కువ కనిపిస్తున్నారు . వింత ఏమిటి అంటే వీరందరూ ఒకే రంగు , ఒకే రకమైన దుస్తులు ధరిస్తున్నారు .. ఆపాదమస్తకం నల్లటి నలుపు పఠాన్ దుస్తులు ధరించే యువకులు , వీరి వెంటనే చక్కగా వాయాల్ చీర చుట్టిన ఆడ లేడీస్ .మొహానికి ఒక అర కిలో పౌడర్ అద్ది , కూసంత లిప్ స్టిక్ పామేసి, గుప్పు మనే పెర్ఫ్యుములు, ఇవన్ని సింగారించి రాగానే వెల్కం డ్రింక్ అందిస్తూ కనిపిస్తారు. వీరంతా ఎవరా అని చూస్తే "event management" వారట . మన పెళ్లి తతంగం అంత వీరే చక్కపెడతారట . పెళ్ళికి కావలిసిన సమస్తం ఏర్పాటు చెయ్యడం , మండపం అలంకారం , వంటలు , వార్పులు , ఏమి బట్టలు తోడుక్కోవాలో , ఎప్పుడు ఏమి వేసుకోవాలో , ఎప్పుడు ఫోటోలు తీసుకోవాలో , ఎలా నవ్వాలో , పెళ్ళయ్యాక ఎలా eఏడవాలో , అసలు తాళి ఎలా కట్టాలో , తలంబ్రాలు ఎలా పొయ్యలో కూడా వారే చెప్తారు అంటే అతిశయం కాదు . వీరు కావాలంటే బంధువులను కూడా అద్దెకు ఇస్తారట , పెళ్లి మండపం నిండుగా ఉండటం కోసం. అసలు వీలు కాదు కాని అమ్మాయికి తాళి కూడా కట్టేస్తారు ఈ ఈవెంట్ మనజేర్లు ఇన్ని చేసిన , మండపం మొహానికి ఒక మావిడకు లేనే లేదు .. అవును లెండి చెట్లే తక్కువ అవ్తున్న ఈ రోజుల్లో , మావిడాకులు దొరకడం అవి పెళ్ళికి వినియోగించడం విషయమే.
ఇక్కటి తో ఆగలేదు , వీటికి తోడు మరో వింత ఏమిటి అంటే , సంగీత కచేరి... ఒక పక్క వధూవరులు స్టేజి మీద నుంచుని వచ్చే వారందిరిని పలకరిస్తూ, వారిచ్చే కానుకలు స్వీకరిస్తూ అలసి పోతూంటే, మరో పక్క వాడెవడో డి జే అట , చెవులు గగ్గోల పడేలా రీమిక్స్ పాటలు . అసలు సంప్రదాయ బద్దంగా సన్నాయి లేక షహనాయి వాయిద్యాలు, పెళ్లి పాటలు, ఆ సంబరాలు సరదాలు చాల తక్కువ అయిపోయాయి..... ఎం చేస్తాము? మారుతున్న కాలం లో అంతే మరి.
ఇక భోజనాలకి వస్తే , తినగలిగిన లేకపోయినా , ఎన్ని ఎక్కువ పదార్థాలు ఉంటే అంత గొప్ప. చైనీస్, ఇటాలియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చాట్, పళ్ళు , ఐస్ క్రీమ్, దోసలు. ఇలా ప్రాంతాల వారీగా , ఇక మిఠాయిల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు . అసలు ఎన్ని రకాలు పెడితే అంత గోప్పవారా అన్నట్టు పెడుతున్నారు. మొత్తం మీద ఒక మనిషి వారం పది రోజులకి సరిపడ భోజనం పెట్టయ్యడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీనికి తగ్గ daabbu gunjadam catering వాళ్లki alavaataipoindi.

మొత్తం మీద మన పద్ధతుల్లో చాల మార్పు వచేస్తోంది. అది మంచి ఐతే బాగానే ఉండు ...........................దీని పర్యవసానం ఎలా ఉంటుందో కాలమే చెప్తుంది.

Comments

Kesav said…
sampradayalu vantivevaina unte manam ika marchi povacchu. Evvariki anta time ledu, dani todu adi andariki chadastam laga anipistundi. marutunna kaalam mari...

ee madhya kaalam lo santrupti ga vaddana bhojanalu tini enta ledanna enimidi (8) yellu ayyindi..

hitech paddhatulu inka enni maarpulu testayo chuudali...

hitech peruna dabbu gummmarinchadanam tappa dani mulanga oche santrupti ekkada chuda ledu..

Popular posts from this blog

నా స్నేహితుడి కథలు

ఈ మధ్య మా సన్నిహితుడు ఒకాయన రాయడం మొదలెట్టాడు. ఐతే ఏమిటా రాత?  ఎంతో కాలంగా ఆయన, నేను ఏవేవో చెయ్యాలని ఆలోచించే వాళ్ళం . సినిమా కథలు రాయడమా, తెలుగు భాషని రక్షించడానికి ఏమైనా ఆన్లైన్ కోర్సులు తాయారు చెయ్యడమా? లేక MBA కళాశాలల్లో ఏమయినా వ్రుత్తి పరమైన విషయాల మీద ప్రత్యేక  పాఠ్య ప్రణాళిక తాయారు చెయ్యడమా ... ఇలా చాలా విషయాల మీద చర్చించే వాళ్ళం . ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్టు ఏదీ ఎటూ పోలేదు.  కాని ఆయన మాత్రం మొత్తానికి ఆంగ్లం లో రాసాడు ఒక కాలేజీ ప్రేమ కథ. అది త్యాగమా? ప్రేమ విజయమా? లేక మనుషుల స్వభావాలు అద్దంపట్టే ఒక అందమైన కథా? అనేది మీరే చదివి తెలుసుకోండి. కాని అందులో ప్రతీ సన్నివేసం చాలా చక్కగా వర్నించారు. ముఖ్యంగా అందులోని పాత్రలు శామ్యూల్, ఎస్తేర్, కనిష్క ల వర్నికరణ చాల కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.  ఇది చదివిన ఆయాన స్నేహిత వర్గం అందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావని, వారి చిననాటి నిజ జీవితం లో జరిగిన సంఘటనలేనని అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంతే కాదు అందులో కొన్ని సన్నివేశాలకి కొందరు, అయ్యో అని విస్తు పోగా, కొందరు హా అని నవ్వారు, మరికొందరు ...

బొమ్మల బాపు గారు ఇక లేరు - తనికెళ్ళ భరణి

https://www.facebook.com/tanikella.bharani/photos/a.265971403570921.1073741826.265963416905053/388887484612645/?type=1&theater