Skip to main content

నా స్నేహితుడి కథలు

ఈ మధ్య మా సన్నిహితుడు ఒకాయన రాయడం మొదలెట్టాడు. ఐతే ఏమిటా రాత?  ఎంతో కాలంగా ఆయన, నేను ఏవేవో చెయ్యాలని ఆలోచించే వాళ్ళం . సినిమా కథలు రాయడమా, తెలుగు భాషని రక్షించడానికి ఏమైనా ఆన్లైన్ కోర్సులు తాయారు చెయ్యడమా? లేక MBA కళాశాలల్లో ఏమయినా వ్రుత్తి పరమైన విషయాల మీద ప్రత్యేక  పాఠ్య ప్రణాళిక తాయారు చెయ్యడమా ... ఇలా చాలా విషయాల మీద చర్చించే వాళ్ళం . ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్టు ఏదీ ఎటూ పోలేదు. 

కాని ఆయన మాత్రం మొత్తానికి ఆంగ్లం లో రాసాడు ఒక కాలేజీ ప్రేమ కథ. అది త్యాగమా? ప్రేమ విజయమా? లేక మనుషుల స్వభావాలు అద్దంపట్టే ఒక అందమైన కథా? అనేది మీరే చదివి తెలుసుకోండి. కాని అందులో ప్రతీ సన్నివేసం చాలా చక్కగా వర్నించారు. ముఖ్యంగా అందులోని పాత్రలు శామ్యూల్, ఎస్తేర్, కనిష్క ల వర్నికరణ చాల కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.  ఇది చదివిన ఆయాన స్నేహిత వర్గం అందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావని, వారి చిననాటి నిజ జీవితం లో జరిగిన సంఘటనలేనని అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంతే కాదు అందులో కొన్ని సన్నివేశాలకి కొందరు, అయ్యో అని విస్తు పోగా, కొందరు హా అని నవ్వారు, మరికొందరు జీవితం ఇంతే అని నిట్టూర్చారు. ఇక కథ మీద వారు ముద్రించిన బ్లాగ్ లో ఇష్టాగోష్టులు, చర్చలు,  ప్రసంసలు, సూచనలు ఇలా ఒకటి కాదు... ఆయన సినిమా కి ఆయనే ఒక రాజమౌళి అయ్యాడు. బాహుబలి చిత్రం రికార్డుల ప్రకంపనలు ఎలా ఉన్నాయో, ఈయనగారి కథకి ఒకింత అంతే అని అతిశయంగా చెప్పుకోవచ్చు. 

ఇదంతా కథకుడి నైపుణ్యం. 

ఇలా అందరూ ఇచ్చిన అభిప్రాయాల బలం మీద పైన చెప్పిన బాహుబలి తీరు గానే ఆయన కథకి పార్ట్ 2 లేక ముగింపు రాద్దామని నిర్ణయించుకున్నారు. ఆయన కథా దండయాత్ర సఫలం అవుతుంది అని కోరుకుంటున్న! 

అశేష కథా / జన సందోహంలో, సశేషం గా మిగిలిపోకుండా, విశేషంగా ఉండాలని ఆశిస్తూ ......... 






Comments

Popular posts from this blog

మన హాస్య రచనలు  ఈ మధ్య కాలం లో నేను తెలుగు మీద విరగపడి, మన రచనా కౌసల్యం చాటే కొన్ని రచనలు చదువుతున్న. అందులో బాగా ఆకట్టుకున్న పుస్తకాలు.. మునిమాణిక్యం వారివి .... వీరు రాసిన "మాణిక్య వచనాలు" చాల బావున్నాయి. తెలుగు భాష మీద మక్కువ ఉన్నవారు తప్పనిసరిగా చదవవాల్సింది అని నా భావన. ఈ కింది లింకు లో వారి రచనలు, వాటి గురించి కొద్దిపాటి వివరణ ఉన్నాయి . వీలైతే పుస్తకాలు కొని చదవండి.............. http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=౯౭