Skip to main content

భాష

మళ్ళీ మన భాష గురించి కొంచెం రాద్దామని ................

ఇటీవల కాలం లో మన తెలుగు పలు మార్పులకు గురి అయ్యింది. అసలు భాష మాట్లాడడానికి రాకపోగా మనం ఇతర భాషల నుంచి పదాలను తర్జుమా చేసుకుంటున్నాము... మన తెలుగు పదాలు చాల మతుక్కు ఇప్పటికే మనం మర్చిపోయాము. .. ఇక రాను రాను మన పరిస్తితి అదేదో సామెత చెప్పినట్టు " రాను రాను రాజు గారి గుర్రం గాడిద అయ్యిందట" .. అలా తయారవ్తోంది... ఈ మధ్యనే పాండురంగడు అని ఒక గొప్ప చిత్రం చూసా. అది భక్తి చిత్రమా లేక రక్తి చిత్రమా అని అర్ధం అయ్యేట్టప్పడికి చిత్రం అయిపోయింది. మా స్నేహితుడు చెప్పినట్టు దీనికి పూలరంగడు అని పేరు పెట్టాల్సింది అన్నాడు. ఐతే ఇక అసలు విషయానికి వస్తే , ఈ చిత్రం లో సంభాషణలు , నారదులు వారు ఒక సారి "మీకు అంత సన్నివేశము లేదు " అని అంటారు. ఇది మామూలుగా మన చిత్రాల్లో వినే " నీకంత శీను లేదు" అనే మాటని అనువదించారు... అలాగేయ్ " కాస్త విభిన్నంగా ఉంటుంది అని" అనేది మనం వినే "కాస్త వెరైటీ గ ఉంటుంది అని" అనే మాటని మార్చేసారు .......ఇంక " ఉట్టి పగులుతుంది" అనే మాట " బాక్స్ బద్దలవ్తుంది" అనే మాటను గ్రాంధికం చేస్తినట్టు ఉంది. మన భాష లో మంచి పదాలు లేవా, మనకున్న మాటలతో మంచి హాస్యాన్ని చెయ్యలేమా.. కేవలం చిత్రం అన్ని వర్గాల వారిని అలరించాలని మన భాషా విలువలని ఇలా దిగాజార్చాల? ఆ మధ్య వచ్చిన అన్నమయ్య చిత్రం లో కూడా రాజు గారు ఒక చోట "ఆ ఉల్ఫా గాడు ఎవడు" అని అంటాడు ... నాకు ఈ ఉల్ఫా అనేది తెలుగు భాష లో తిట్టు అని అప్పటి దాక తెలియదు.

ఇక చలన చిత్రాల నుంచి మన మీడియా వారి సంగతికి వస్తే, ప్రతీ వారు సంభందం ఉన్నా లేక పోఇన , ఏ విషయం ఐన వేసే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి . అవి చాల అర్ధ రహితంగా ఉంటాయి .....................ఏదైనా సరే .. " మీ స్పందన ఏమిటి ?", " దీనిని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు?" .. ఇలా అర్ధం పర్ధం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ... అసలు సందర్భోచితం గా మాట్లాడడం అనేది మనం మర్చిపోతున్నమా? మన రాజకీయ నయుకుల విషయానికి వస్తే ఇంక చేపక్కర్లేదు......... అసలు విషయం తక్కువా... వాగుడు ఎక్కువా.... దీంతో మనకు విసుగు వగైరా వగైరా.....
మొత్తం మీద మనం నేను ఎప్పుడు చెప్పినట్టే అందరు మన అందాల తెలుగును మర్చిపోతున్నారు .. దీనిని కాపాడుకోవటం మన అందరి మీద ఎంతైనా ఉంది......

Comments

Popular posts from this blog

నా స్నేహితుడి కథలు

ఈ మధ్య మా సన్నిహితుడు ఒకాయన రాయడం మొదలెట్టాడు. ఐతే ఏమిటా రాత?  ఎంతో కాలంగా ఆయన, నేను ఏవేవో చెయ్యాలని ఆలోచించే వాళ్ళం . సినిమా కథలు రాయడమా, తెలుగు భాషని రక్షించడానికి ఏమైనా ఆన్లైన్ కోర్సులు తాయారు చెయ్యడమా? లేక MBA కళాశాలల్లో ఏమయినా వ్రుత్తి పరమైన విషయాల మీద ప్రత్యేక  పాఠ్య ప్రణాళిక తాయారు చెయ్యడమా ... ఇలా చాలా విషయాల మీద చర్చించే వాళ్ళం . ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్టు ఏదీ ఎటూ పోలేదు.  కాని ఆయన మాత్రం మొత్తానికి ఆంగ్లం లో రాసాడు ఒక కాలేజీ ప్రేమ కథ. అది త్యాగమా? ప్రేమ విజయమా? లేక మనుషుల స్వభావాలు అద్దంపట్టే ఒక అందమైన కథా? అనేది మీరే చదివి తెలుసుకోండి. కాని అందులో ప్రతీ సన్నివేసం చాలా చక్కగా వర్నించారు. ముఖ్యంగా అందులోని పాత్రలు శామ్యూల్, ఎస్తేర్, కనిష్క ల వర్నికరణ చాల కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.  ఇది చదివిన ఆయాన స్నేహిత వర్గం అందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావని, వారి చిననాటి నిజ జీవితం లో జరిగిన సంఘటనలేనని అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంతే కాదు అందులో కొన్ని సన్నివేశాలకి కొందరు, అయ్యో అని విస్తు పోగా, కొందరు హా అని నవ్వారు, మరికొందరు ...

బొమ్మల బాపు గారు ఇక లేరు - తనికెళ్ళ భరణి

https://www.facebook.com/tanikella.bharani/photos/a.265971403570921.1073741826.265963416905053/388887484612645/?type=1&theater