ఈమధ్యనే ఒక పెళ్ళికి వెళ్ళాను . అసలు పెళ్లి తతంగం అంత చాల మారిపోయింది. వెళ్ళినప్పటి నుంచి వచీదాక నేను చూసిన కొన్ని దృశ్యాల సమాహారమే ఈ చిట్టి వ్రాత .
అసలు పెళ్లి మండపం లో పెళ్లి వారు , వారి బంధు మిత్రుల కంటే , కొత్త చుట్టాలు ఎక్కువ కనిపిస్తున్నారు . వింత ఏమిటి అంటే వీరందరూ ఒకే రంగు , ఒకే రకమైన దుస్తులు ధరిస్తున్నారు .. ఆపాదమస్తకం నల్లటి నలుపు పఠాన్ దుస్తులు ధరించే యువకులు , వీరి వెంటనే చక్కగా వాయాల్ చీర చుట్టిన ఆడ లేడీస్ . వీరంతా ఎవరా అని చూస్తే "event management" వారట . మన పెళ్లి తతంగం అంత వీరే చక్కపెదతారట . పెళ్ళికి కావలిసిన సమస్తం ఏర్పాటు చెయ్యడం , మండపం అలంకారం , వంటలు , వార్పులు , ఏమి బట్టలు తోడుక్కోవాలో , ఎప్పుడు ఏమి వేసుకోవాలో , ఎప్పుడు ఫోటోలు తీసుకోవాలో , ఎలా నవ్వాలో , పెళ్ళయ్యాక ఎలా eఏడవాలో , అసలు తాళి ఎలా కట్టాలో , తలంబ్రాలు ఎలా పొయ్యలో కూడా వారే చెప్తారు అంటే అతిశయం కాదు . అసలు వీలు కాదు కాని అమ్మాయికి తాళి కూడా కట్టేస్తారు ఈ ఈవెంట్ మనజేర్లు ఇన్ని చేసిన , మండపం మొహానికి ఒక మావిడకు లేనే లేదు .. అవును లెండి చెట్లే తక్కువ అవ్తున్న ఈ రోజుల్లో , మావిడాకులు దొరకడం అవి పెళ్ళికి వినియోగించడం విషయమే.
ఇక్కటి తో ఆగలేదు , వీటికి తోడు మరో వింత ఏమిటి అంటే , సంగీత కచేరి... ఒక పక్క వధూవరులు స్టేజి మీద నుంచుని వచ్చే వారందిరిని పలకరిస్తూ, వారిచ్చే కానుకలు స్వీకరిస్తూ అలసి పోతూంటే, మరో పక్క వాడెవడో డి జే అట , చెవులు గగ్గోల పడేలా రీమిక్స్ పాటలు . అసలు సంప్రదాయ బద్దంగా సన్నాయి లేక షహనాయి వాయిద్యాలు, పెళ్లి పాటలు, ఆ సంబరాలు సరదాలు చాల తక్కువ అయిపోయాయి..... ఎం చేస్తాము? మారుతున్న కాలం లో అంతే మరి.
ఇక భోజనాలకి వస్తే , తినగలిగిన లేకపోయినా , ఎన్ని ఎక్కువ పదార్థాలు ఉంటే అంత గొప్ప. చైనీస్, ఇటాలియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చాట్, పళ్ళు , ఐస్ క్రీమ్, దోసలు. ఇలా ప్రాంతాల వారీగా , ఇక మిఠాయిల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు . అసలు ఎన్ని రకాలు పెడితే అంత గోప్పవారా అన్నట్టు పెడుతున్నారు. మొత్తం మీద ఒక మనిషి వారం padi rojulaki saripada భోజనం pettayyadam ఒక fashion అయిపోయింది. దీనికి tagga daabbu gunjadam catering వాళ్లki alavaataipoindi.
Comments