అసలు రాతలు పొయాయి.. ఈ మధ్య బుక్ ఫెయిర్ 2014 కి వెళ్ళాను. అక్కడ ఊహించని రీతిలో జన సందోహం. ఈ హడావిడి లో ఓక మంచి విషయం ఒక శోచనీయమైన విషయం కనిపించాయి. ఈ సారి విశేషంగా తెలుగు పుస్తకాల దగ్గర బాగా జనం కనిపించడం మంచి విషయం ఐతే, అసలు ఈ మధ్య కాలం లో తెలుగు రచనలు ఎక్కువ మటుకు ఆంగ్ల పుస్తకాల అన్వయాలె అవ్వడం కొంచెం బాధాకరం !.
అసలు తెలుగు లో రాసే వారీ లేరా అనీ అనుమానం కలిగింది . ఇది కడు శోచనీయం బాధాకరం.
అసలు రాయడం అంత కష్టమా? ఒకప్పుడు ఉత్తరాలు ద్వారా అయిన తెలుగు లో రాసే వారు, కాని ఇప్పుడు అంతా "ఇ" అయిపోవడంతో చాల మందికి రాసే అవకాసమెయ్ లేదాయే!
ఈ మధ్య కళలు కూడా అన్ని కేవలం సినిమా కె పరిమితం అయిపోతున్నాయి. బహుశా ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు
1. కధలు - కధలు రాయటం ఒకప్పుడు సినిమాకి లేక నాటకానికి అతీతంగా ఉన్దగా.. ఇప్పడు మాత్రం కదలు రాసే వాడు సినిమా కి సంబంధించినవి అవ్తున్నయి. ఐతే దీనివల్ల కదలు రాసే వారిలో సృజనాత్మకత కనుమెరుగవుతున్నాయి. పోనీ తెలుగు సినిమాలు ఒక మంచి నవల ఆధారంగా చేసి తీసేవి ఈ మధ్య కనపడం లెదు. హాలీవుడ్ లో ఈ ఏడాది ఎంపికైన చిత్రాలు నవల ఆధారంగానో లేక నిజ జీవతం లో జరిగిన సన్నివేశాల అధారంగానో తీసినవే! ఇక మన బాలీవుడ్ సంగంతి కూడా మనకంటే కొంచెం మేలే అని చెప్పు కోవాలి. చేతన్ భగత్ కధలు ఆధారంగా తీసీ చిత్రాలు అంతకు మున్దే మార్కెట్ లో మంచి హిట్ అయిన నవలలు!
మరి మన దగ్గర ఎందుకు ఈ కొరత.
2. సంగీతం- ఇక సంగీతం అంటే - సంగీత దర్సకత్వం, ప్లే బ్యాక్ శింగింగ్, ..... ఏవి తీసుకున్నా కేవలం సినిమా కె పరిమితం అవ్తున్నాయి. దీనితో అంత రొటీన్ సంగీతం అయిపోతోంది.
కళలు సినిమా కి అతీతం గ ఉంటె మనకి ఇంకా బోలెడు మంది కళాకారులు ఉద్భవిస్తారు , ఇంకా సృజనాత్మకత పెరుగుతుంది.
అందరం తెలుగు లో రాద్దాము.... తెలుగు లో ఆలోచిద్దాము ....... తెలుగు వేలుగు !!
Comments