ఓం సాయి రాం
అమ్మ .... అప్యాయానికి మారు పేరు, నిస్స్వర్తానికి నిలువెత్తు నిదర్సనం . ఒక వ్యక్తిని - ఆడ ఐనా మగ అయినా తీర్చిదిద్దడంలో, వారికి సరైన నడవడి అలవడే లాగ పెంచడంలో ఒక తల్లి పాత్ర ఎంతైనా ఉంది.
భారత దేశం లో ఎందఱో గొప్పవాళ్ళు జన్మించారు. అయితే వీరు జన్మతః గొప్ప వారు గ పుట్ట లేదు. వీరి లో ఒక ఉన్నత ఆలోచన సరళి అలవడే లాగ తీర్చి దిద్దడంలో వారి జీవితంలో చూసిన పలు సందర్భాలు ఒక ఎత్తైతే , మరో పక్క వారికీ చిన్న చిన్న అడుగులు వేయడం నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వరకు కుటుంబం భాద్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన దేశం లో ఉన్న్న తత్త్వవేత్తలు, మహారాజులు, కవులు సంఘ సంస్కర్తలు, వీర
పుత్రులు, శాస్త్రవేత్తలు , ఇలా ఒకరు కాదు ఎంతో మంది మన దేశ కీర్తి ప్రతిష్ట్టలు పెంచారు అంతే నూటికి తొంభై శాతం వారి వెనుకు ఒక తల్లి కారణం. భారత దేశపు గోపదనం, వెన్నుముఖ ఎవరయ్య అంటే, ఎల్లా వేళల బిడ్డ బాగోగులు కోరుకునే తల్లులు.
ఈరోజుకి ఒకడు ఏదైనా సాధిస్తున్నాడు అంతే దానికి కారణం అమ్మ అమ్మ అమ్మ.......
అమ్మ అంటే ఒక నమ్మకం , ఒక ధైర్యం, ఒక ధీమా, ఒక కనిపించని శక్తీ, నడిపించే వ్యక్తి, నిత్య శ్రేయోభిలాషి, నిస్స్వార్థ ప్రేమ స్వరూపం. ఒక తల్లి సంకల్పం మన భవితను నిర్ణయిస్తుంది. ఒక కప్ప ఎలాగైతే దూరంగా ఉంటూ తన చూపులతో దాని బిడ్డని కాస్తుందో, అలాగే ఒక తల్లి సంకల్పం తల్లడిల్లే తనయుల రాతని కూడా మారుస్తుంది .
Comments