Skip to main content

Posts

Showing posts from 2012

అమ్మ ....

ఓం సాయి రాం  అమ్మ .... అప్యాయానికి మారు పేరు, నిస్స్వర్తానికి నిలువెత్తు నిదర్సనం . ఒక వ్యక్తిని - ఆడ ఐనా మగ అయినా తీర్చిదిద్దడంలో, వారికి సరైన నడవడి అలవడే లాగ పెంచడంలో ఒక తల్లి పాత్ర ఎంతైనా ఉంది. భారత దేశం లో ఎందఱో గొప్పవాళ్ళు   జన్మించారు. అయితే వీరు జన్మతః గొప్ప వారు గ పుట్ట లేదు. వీరి లో ఒక ఉన్నత ఆలోచన సరళి అలవడే లాగ తీర్చి దిద్దడంలో వారి జీవితంలో చూసిన పలు సందర్భాలు  ఒక ఎత్తైతే , మరో పక్క  వారికీ చిన్న చిన్న అడుగులు వేయడం నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వరకు  కుటుంబం భాద్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన దేశం లో ఉన్న్న తత్త్వవేత్తలు, మహారాజులు, కవులు సంఘ సంస్కర్తలు, వీర  పుత్రులు, శాస్త్రవేత్తలు , ఇలా ఒకరు కాదు ఎంతో మంది మన దేశ కీర్తి ప్రతిష్ట్టలు పెంచారు అంతే నూటికి తొంభై శాతం  వారి వెనుకు ఒక తల్లి కారణం.  భారత దేశపు గోపదనం, వెన్నుముఖ ఎవరయ్య అంటే, ఎల్లా వేళల బిడ్డ బాగోగులు కోరుకునే తల్లులు.  ఈరోజుకి ఒకడు ఏదైనా సాధిస్తున్నాడు అంతే దానికి కారణం అమ్మ అమ్మ అమ్మ....... అమ్మ అంటే ఒక నమ్మకం , ఒక ధైర్యం, ఒక ధీమా, ...
మన హాస్య రచనలు  ఈ మధ్య కాలం లో నేను తెలుగు మీద విరగపడి, మన రచనా కౌసల్యం చాటే కొన్ని రచనలు చదువుతున్న. అందులో బాగా ఆకట్టుకున్న పుస్తకాలు.. మునిమాణిక్యం వారివి .... వీరు రాసిన "మాణిక్య వచనాలు" చాల బావున్నాయి. తెలుగు భాష మీద మక్కువ ఉన్నవారు తప్పనిసరిగా చదవవాల్సింది అని నా భావన. ఈ కింది లింకు లో వారి రచనలు, వాటి గురించి కొద్దిపాటి వివరణ ఉన్నాయి . వీలైతే పుస్తకాలు కొని చదవండి.............. http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=౯౭  

ఈ కాలం

" ఈ"  కాలంలో కూడా ఇంకా కాగితాల మీద రాయాలి అంటే అంతా విడ్డూరం గా చూస్తున్నారు. ఒక పక్క ఇంకా కాగితాలా అని ఒక అంటరాని వాడిలా  చూసే యువత , మరో పక్క "గో గ్రీన్ " అంటూ నినాదాల వెల్లువ కురిపించే ఉద్యమకారులు. అసలు నా అంచనా ప్రకారం ఇంకా చాల మంది రచయితలకి  కలము కాగితమే ఆధారం. అసలు " ఈ " చిట్టాలు రాయడం వాళ్ళ ఉపయోగం ఉందా? నా దృష్టిలో రాయడానికి కొద్దిగా కష్టం అవతుంది తప్ప, ఆన్ లైన్ రాయటంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ... అసలు మొట్ట మొదటిగా చాల కాలం తరువాత ఈ తరం వారికి తెలుగు మల్లి చదవడం అన్నది అబ్బుతోంది. ఎందుకంటారా, మన పుర జనులు తెలుగు వార్త పత్రిక కాని , తెలుగు పుస్తకాలు కాని చదవడం అన్నది అంత్యంత అరుదుగా కనిపించే దృశ్యం.  అందు చేత తెలుగు బ్లాగులు , బాగుగా నడవాలని, అందరు చదవాలని , మనసార కోరుకుంటున్నా. సశేషం