ఈ రోజు ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న. ఉన్నట్టుండి హతాతు గ నేను 8 ఏళ్ళు వెనక్కి వెళ్ళ. అది చెన్నై లో నా ఉద్యోగ పర్వం లో మొదటి నెల. అప్పుడు ఏమి తెలియకుండా నేను రీసెర్చ్ రెపొర్త్స్ రాసేవాడిని. తక్కువ సమయం లో ఎక్కువ నేర్చుకున్న రోజులు . ఎంతో ఉత్తేజంగా, ఉత్సాహం గ , చురుకు గ ఉండే వాడిని. అన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న తపన. ఏదైనా చెయ్యగలము అన్న ధీమా. కంపెనీ రేసేఅర్చ్ రిపోర్ట్ రాయటానికి మేము మొదట్లో వేరే వారు రాసిన రిపోర్ట్లు చదివి , అర్ధం చేసుకుని, మా పంధా లో మేము రాసే వాళ్ళము. బ్లూమ్బెర్గ్ కొత్తగా నేర్చుకుంటున్నాము , మేమే అసలు దానిని బాగా వాడడం మొదలుపెట్టాము. అందరికి ఆఫీసు లో మార్గదర్సులము. అందులో జాకీరు బాగా దిట్ట ………………….ఇలా ఉండేది.
ఈ మధ్య గత రెండు రోజులుగా మన రాష్ట్రమంతటా ఆకాశ ప్రకంపలనికి గురయ్యింది. అసలు వానలు కురవట్లేదు అనుకుంటున్నా సమయంలో విపరీతమైన వానలతో ఒక ఊపు ఊపేసింది. అంత అల్లా కల్లోలం ఎక్కడ చూసిన గందర గోళం . అసలు దీనికి కారణం ఏమయ్యుంటుంది .........? మన వాళ్లు చేసిన వరుణ పూజలు, హోమాలా? లేక అల్ప పీడనమా? లేక దశావతారం సినిమా లో చూపించినట్టు ఏదో గొప్ప ప్రమాదాన్ని తప్పించటానికి దేవుడు చేసిన లీలా? ......... వీటిలో ఏదో ఒకటి కారణం అయ్యుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటెయ్ మీరు పప్పు లో కాలు వేసినట్లే. దీనికి కారణం నీను చిట్ట చివరకు నా పాస్స్పోర్ట్ అప్లై చెయ్యగలిగాను. ఇది ఒక కారనమేనా అని మీరంతా విస్తు పోతే చెప్తా చదవండి.... ఇది వరకు నేను నా ఆంగ్ల "ఈ - శీర్షిక" లో చెప్పినట్టు , నేను కారు కొందామనుకుంటే అప్పుడు లోను ధరలు పెరిగినాయి.. అలాగే కొన్న తరువాత పెట్రోల్ ధరలు పెరిగాయి, ఇదే విధంగా నేను మా కంపెనీ UBS లో జాయిన్ ఐన తరువాత , ఆ కంపెనీ కి దాని చరిత్ర లో ఎప్పుడు రానంత నష్టాలు వచ్చాయి. అదే విధంగా నేను ఈ యేడాది మొదలులో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టా, వెంటనే స్టాక్ మార్కెట్ పతనమైపాయింది . అప్పటి నుంచి ఇప్పటి దాక ...
Comments