

మళ్ళా చాలా రోజుల తరువాత నేను రాస్తున్న. ఈ మధ్య కాలంలో నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది . నాకు అబ్బాయి పుట్టాడు. వాడికి ముద్దుగా ఆశ్రిత్ అని పేరు పెట్టుకున్నాము. నా జీవితంలో చాల ఆనందదాయకమైన రోజు అక్టోబర్ ౨౩. రకరకాల భావాలతో ఉన్నాను. ఒక పక్క చాల సంతోషం, మరో పక్క చాల ఆశ్చర్యం - నేను కూడా తండ్రి అయ్యాను అని. ఇప్పటికి రెండు నెలలు పైన గడిచాయి వాడు పుట్టి. రోజూ వాడు చీసే చేష్టలతో నాకు రోజుకో రకమైన కొత్త అనుభవం. ఇంకా ముందు ముందు ఎలా మారనున్నదో కాలమే చెప్తుంది. అంతవరకు మీరందరూ మా చిట్టి గాడి చిత్రాలు ఇందులో తిలకించండి. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ చూడండి
Comments