Skip to main content

నా విదేశ పయనం

మొత్తానికి కదిలింది బ్రహ్మ రథం! అని అనుకున్నారు నా స్నేహితులు మరియు బంధు ప్రజానీకం . ఏమిటా అని అనుకుంటున్నారా , నేను మొత్తానికి విమానమెక్కి విదేశాలకి పయనించా. చాల మంది నా జీవితంలో నా జన్మ భూమిని దాటాను అని అనుకున్నారు. అందులో వారి తప్పు ఏమి లేదు. నా ప్యాంటు కిందకి ముప్పయ్ ఏళ్ళు వచినా నా మొహాన్న పాస్స్పోర్ట్ మాత్రాం లేదు కదామరి !!అందుకని అందరు నేను కచిచితంగా ఇక్కడే పాతుకుని ఉంటాను అని అనుకున్నారు. కాని నా సహధర్మ చారిణి ( నా పెళ్ళాం) మాత్రాం ఊరుకోలేదు. ప్రతీసారి వచ్చిన అవకాశాలన్నీ ఇలాగే నేను జారవిడుచుకోవడం తనకి నచచలేదు. మొత్తానికి పట్టు పట్టి పాస్స్పోర్ట్ సంపాదించుకున్న. ఇన్నాళ్లూ తలకిందుల తపస్సు చేసిన అవ్వని పని మొత్తానికి అయ్యింది. బతుకు జీవుడా అనుకున్నా.
ఇక గతంలో అన్నీవిపరీతాలు జరిగాయి అని నేను చెప్పినట్టు, నా విదేశీ ప్రయాణం కూడా ఒక విపరీతమే. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంత ఆర్ధిక సంక్షోభం వచ్చి తల్లకిన్దులైపొతో ఉన్నఈ సమయమ్లో, అసలు ఉద్యోగం ఉంటుందో , ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో, అన్నీ కంపెనీల వారు కాస్ట్ కట్టింగ్ చేస్తున్న ఈ సందర్భంలో , మా కార్యాలయం వారికి ఒక అద్భతమైన ఆలోచన వచ్చింది , నన్ను పోలాండ్ పంపిద్దామని. ఎందుకంటే అక్కడ ఎవరికో ట్రైనింగ్ ఇవ్వాలట, దానికి నేనే అర్హుడని అనుకున్నారు. సరే ! ఎలాగు వెళ్తున్నాను కదా అని అక్కడ నుంచి హోల్లాండ్, ఇంగ్లాండ్ కూడా వెళ్లి మా ఆఫీసు వారి వ్యవహారాలు చక్కపెట్టుకుని రమ్మన్నారు. సరే వెళ్ళకవెళ్ళక వెళ్తున్న నాకు ఈ మూడు అవకాశాలు రావడం " రొట్టె విరిగి నేటి లో పడ్డట్టయ్యింది" . సరే ఇక అసలు ప్రయాణం కోసం మా ఆఫీసు వారి పని తీరు మూలంగా "నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించినట్టు అయ్యింది" నా పరిస్థితి. ఒక ప్రభుత్వ కార్యాలయం లో ఐన పని చేయించు కోవచ్చు కాని మా ఆఫీసు లో పనులు జరగడానికి మాత్రాం జేజమ్మలు దిగి రావలసిందే. వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్టు నా ప్రయాణానికి కూడా అన్నీ చికాకులే. హోటల్ బుక్ ఐతే, విమానం టిక్కెట్టు దొరకదు, అది కుదిరితే దానికి డబ్బులు కుదరవ........ ఇలా ఒక్కటేంటి , అన్నీ విషయాలలోనూ నాకు చుక్కెదురే. మొత్తానికి ఆ శుభఘడియ రానే వచ్చింది. నవంబర్ పదహారున నా ప్రయాణం మొదలయ్యింది ................... సశేషం!!

Comments

Popular posts from this blog

నా స్నేహితుడి కథలు

ఈ మధ్య మా సన్నిహితుడు ఒకాయన రాయడం మొదలెట్టాడు. ఐతే ఏమిటా రాత?  ఎంతో కాలంగా ఆయన, నేను ఏవేవో చెయ్యాలని ఆలోచించే వాళ్ళం . సినిమా కథలు రాయడమా, తెలుగు భాషని రక్షించడానికి ఏమైనా ఆన్లైన్ కోర్సులు తాయారు చెయ్యడమా? లేక MBA కళాశాలల్లో ఏమయినా వ్రుత్తి పరమైన విషయాల మీద ప్రత్యేక  పాఠ్య ప్రణాళిక తాయారు చెయ్యడమా ... ఇలా చాలా విషయాల మీద చర్చించే వాళ్ళం . ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్టు ఏదీ ఎటూ పోలేదు.  కాని ఆయన మాత్రం మొత్తానికి ఆంగ్లం లో రాసాడు ఒక కాలేజీ ప్రేమ కథ. అది త్యాగమా? ప్రేమ విజయమా? లేక మనుషుల స్వభావాలు అద్దంపట్టే ఒక అందమైన కథా? అనేది మీరే చదివి తెలుసుకోండి. కాని అందులో ప్రతీ సన్నివేసం చాలా చక్కగా వర్నించారు. ముఖ్యంగా అందులోని పాత్రలు శామ్యూల్, ఎస్తేర్, కనిష్క ల వర్నికరణ చాల కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.  ఇది చదివిన ఆయాన స్నేహిత వర్గం అందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావని, వారి చిననాటి నిజ జీవితం లో జరిగిన సంఘటనలేనని అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంతే కాదు అందులో కొన్ని సన్నివేశాలకి కొందరు, అయ్యో అని విస్తు పోగా, కొందరు హా అని నవ్వారు, మరికొందరు ...

బొమ్మల బాపు గారు ఇక లేరు - తనికెళ్ళ భరణి

https://www.facebook.com/tanikella.bharani/photos/a.265971403570921.1073741826.265963416905053/388887484612645/?type=1&theater