Skip to main content

వాన

ఈ మధ్య గత రెండు రోజులుగా మన రాష్ట్రమంతటా ఆకాశ ప్రకంపలనికి గురయ్యింది. అసలు వానలు కురవట్లేదు అనుకుంటున్నా సమయంలో విపరీతమైన వానలతో ఒక ఊపు ఊపేసింది. అంత అల్లా కల్లోలం ఎక్కడ చూసిన గందర గోళం . అసలు దీనికి కారణం ఏమయ్యుంటుంది .........? మన వాళ్లు చేసిన వరుణ పూజలు, హోమాలా? లేక అల్ప పీడనమా? లేక దశావతారం సినిమా లో చూపించినట్టు ఏదో గొప్ప ప్రమాదాన్ని తప్పించటానికి దేవుడు చేసిన లీలా? ......... వీటిలో ఏదో ఒకటి కారణం అయ్యుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటెయ్ మీరు పప్పు లో కాలు వేసినట్లే.
దీనికి కారణం నీను చిట్ట చివరకు నా పాస్స్పోర్ట్ అప్లై చెయ్యగలిగాను. ఇది ఒక కారనమేనా అని మీరంతా విస్తు పోతే చెప్తా చదవండి.... ఇది వరకు నేను నా ఆంగ్ల "ఈ - శీర్షిక" లో చెప్పినట్టు , నేను కారు కొందామనుకుంటే అప్పుడు లోను ధరలు పెరిగినాయి.. అలాగే కొన్న తరువాత పెట్రోల్ ధరలు పెరిగాయి, ఇదే విధంగా నేను మా కంపెనీ UBS లో జాయిన్ ఐన తరువాత , ఆ కంపెనీ కి దాని చరిత్ర లో ఎప్పుడు రానంత నష్టాలు వచ్చాయి. అదే విధంగా నేను ఈ యేడాది మొదలులో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టా, వెంటనే స్టాక్ మార్కెట్ పతనమైపాయింది . అప్పటి నుంచి ఇప్పటి దాక ఇంక తెరుకొలేదు , అసలు నా ఈ పరిస్థితి చూసి చాల మంది నా స్నేహితులు రియల్ ఎస్టేట్ లో కూడా నేను డబ్బులు పెడితే బావుంటుంది అని సలహా ఇచ్చారు !!! ఎందుకంటే అప్పుడు భూముల ధరలు కూడా తగ్గుతాయి అని . అలాగే నేను చాల కాలంగా ప్రయత్నించి విఫలం అయ్యి ఇంక జీవితం లో నాకు pఆస్స్పోర్ట్ రాదు అని నేను నిర్ధరించుకున్నా. అలాంటిది చివరికి ఎంతో కష్టపడి ఎట్టకేలకు నేను అప్లై చెయ్యగలిగాను. అలా నేను చేసానో లేదో వెంటనే జడి వాన.
ఇలా నేను ఎప్పటినుంచో చెయ్యలిసిన పనులు చేసినప్పుడు , లేక నేను చెయ్యలేను అనుకున్నవి చేసినప్పుడు ఇలాటి విపరీతాలు అవ్తూఉంటాయి.



Comments

5 Ds' said…
vaana kuripinche shakti meeku undhani aaru kotla andhrulaku telisteyyyy...meeru varuna devudu auturu...palle prajala palita varala thalli...kshaminchandu...varalaa thandri aitharu...ee sari malli joruga vana kurisindhantey...passport mudrincha badinadhi ani artham chesukuntam Sai...:)
Vikram said…
Namaskaaram Sai Gaaru. Nenu Vikram (Deloitte Real Estate). Meeru raasina rachana chadivaanu. Chaala baagundi. Meeru mee mitrulu, sthiraasthi ni konugolu cheyamani ichina salaha ni paatinchavalasindi. Ala chesi vunte, neti dinam nenu kooda oka chinna bhoomi konugolu chesevaani. Inko vishayam, meeru konni panulu chesthe ila varshaalu, vipareeta paristhitulu vasthaayani YSR gaariki teliyajeeyandi. Meegha madanaanni aapi Sai naamam smaristhaadu, andulo ennikala mundu, ika meeku peru ki peru, dabbu ki dabbu...

Popular posts from this blog

నా స్నేహితుడి కథలు

ఈ మధ్య మా సన్నిహితుడు ఒకాయన రాయడం మొదలెట్టాడు. ఐతే ఏమిటా రాత?  ఎంతో కాలంగా ఆయన, నేను ఏవేవో చెయ్యాలని ఆలోచించే వాళ్ళం . సినిమా కథలు రాయడమా, తెలుగు భాషని రక్షించడానికి ఏమైనా ఆన్లైన్ కోర్సులు తాయారు చెయ్యడమా? లేక MBA కళాశాలల్లో ఏమయినా వ్రుత్తి పరమైన విషయాల మీద ప్రత్యేక  పాఠ్య ప్రణాళిక తాయారు చెయ్యడమా ... ఇలా చాలా విషయాల మీద చర్చించే వాళ్ళం . ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్టు ఏదీ ఎటూ పోలేదు.  కాని ఆయన మాత్రం మొత్తానికి ఆంగ్లం లో రాసాడు ఒక కాలేజీ ప్రేమ కథ. అది త్యాగమా? ప్రేమ విజయమా? లేక మనుషుల స్వభావాలు అద్దంపట్టే ఒక అందమైన కథా? అనేది మీరే చదివి తెలుసుకోండి. కాని అందులో ప్రతీ సన్నివేసం చాలా చక్కగా వర్నించారు. ముఖ్యంగా అందులోని పాత్రలు శామ్యూల్, ఎస్తేర్, కనిష్క ల వర్నికరణ చాల కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.  ఇది చదివిన ఆయాన స్నేహిత వర్గం అందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావని, వారి చిననాటి నిజ జీవితం లో జరిగిన సంఘటనలేనని అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంతే కాదు అందులో కొన్ని సన్నివేశాలకి కొందరు, అయ్యో అని విస్తు పోగా, కొందరు హా అని నవ్వారు, మరికొందరు ...

బొమ్మల బాపు గారు ఇక లేరు - తనికెళ్ళ భరణి

https://www.facebook.com/tanikella.bharani/photos/a.265971403570921.1073741826.265963416905053/388887484612645/?type=1&theater