ఈ రోజు ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న. ఉన్నట్టుండి హతాతు గ నేను 8 ఏళ్ళు వెనక్కి వెళ్ళ. అది చెన్నై లో నా ఉద్యోగ పర్వం లో మొదటి నెల. అప్పుడు ఏమి తెలియకుండా నేను రీసెర్చ్ రెపొర్త్స్ రాసేవాడిని. తక్కువ సమయం లో ఎక్కువ నేర్చుకున్న రోజులు . ఎంతో ఉత్తేజంగా, ఉత్సాహం గ , చురుకు గ ఉండే వాడిని. అన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న తపన. ఏదైనా చెయ్యగలము అన్న ధీమా. కంపెనీ రేసేఅర్చ్ రిపోర్ట్ రాయటానికి మేము మొదట్లో వేరే వారు రాసిన రిపోర్ట్లు చదివి , అర్ధం చేసుకుని, మా పంధా లో మేము రాసే వాళ్ళము. బ్లూమ్బెర్గ్ కొత్తగా నేర్చుకుంటున్నాము , మేమే అసలు దానిని బాగా వాడడం మొదలుపెట్టాము. అందరికి ఆఫీసు లో మార్గదర్సులము. అందులో జాకీరు బాగా దిట్ట ………………….ఇలా ఉండేది. కాని ఇప్పుడు చాల మార్పు కనిపిస్తుంది అప్పటితో పోల్చుకుంటే . కొన్ని పనులు ఇష్టం లేకపోవటం… నచ్చకపోవటం వగైరా వగైరా… ఎందుకో నాకు అర్ధం అవ్వట్లేదు .ఏది ఏమైనప్పిటికి నా మనస్స్సు 8 ఏళ్ళు వెనక్కి వెళ్లి ఆపాత మధురాలు గుర్తుకొచ్చాయి …….. అది ఆనందకరం
అంతా తెలుగు మయం ......