Skip to main content

Posts

Showing posts from 2010

గుర్తుకొస్తున్నాయి

ఈ రోజు ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న. ఉన్నట్టుండి హతాతు గ నేను 8 ఏళ్ళు వెనక్కి వెళ్ళ. అది చెన్నై లో నా ఉద్యోగ పర్వం లో మొదటి నెల. అప్పుడు ఏమి తెలియకుండా నేను రీసెర్చ్ రెపొర్త్స్ రాసేవాడిని. తక్కువ సమయం లో ఎక్కువ నేర్చుకున్న రోజులు . ఎంతో ఉత్తేజంగా, ఉత్సాహం గ , చురుకు గ ఉండే వాడిని. అన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న తపన. ఏదైనా చెయ్యగలము అన్న ధీమా. కంపెనీ రేసేఅర్చ్ రిపోర్ట్ రాయటానికి మేము మొదట్లో వేరే వారు రాసిన రిపోర్ట్లు చదివి , అర్ధం చేసుకుని, మా పంధా లో మేము రాసే వాళ్ళము. బ్లూమ్బెర్గ్ కొత్తగా నేర్చుకుంటున్నాము , మేమే అసలు దానిని బాగా వాడడం మొదలుపెట్టాము. అందరికి ఆఫీసు లో మార్గదర్సులము. అందులో జాకీరు బాగా దిట్ట ………………….ఇలా ఉండేది. కాని ఇప్పుడు చాల మార్పు కనిపిస్తుంది అప్పటితో పోల్చుకుంటే . కొన్ని పనులు ఇష్టం లేకపోవటం… నచ్చకపోవటం వగైరా వగైరా… ఎందుకో నాకు అర్ధం అవ్వట్లేదు .ఏది ఏమైనప్పిటికి నా మనస్స్సు 8 ఏళ్ళు వెనక్కి వెళ్లి ఆపాత మధురాలు గుర్తుకొచ్చాయి …….. అది ఆనందకరం

మై హాలిడే

గత కొద్ది నెలలుగా నేను సెలవు తీసుకోవడం జరగలేదు. మా అబ్బాయి పుట్టాక మా ఆఫీసు వారు ఇచ్చిన "పటేర్నిటిసెలవు" తప్ప ఇప్పటి దాక నేను సెలవు తీసుకోలేదు. ఇక లాభం లేదని ఫీల్ అయ్యి నాసెలవల కోటా వృధా కాకుండా పది రోజుల పాటు దుమ్మ కొట్టేసా.. అప్పుడే ఒక రోజు అయిపోఇంది. సరే ఇక సంక్రాంతి పండుగ వస్తోంది కదా, ఎక్కడికైనా వెళ్దామా అని అనుకున్న కాని , రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి అది antha సమంజసము కాదని అనిపించింది. సో, ఈ రోజే షాపింగ్ tho మొదలెట్టా నా విరామ విభావరి. మా వాడు పుట్టడం కాదు కాని పోలోమంటూ మా చుట్టాలు బోలెడన్ని బట్టలు పెట్టారు. అసలు పది సంవత్సరాల క్రితం ఎప్పుడో మానేసా బట్టలు కుట్టించుకోవడం అన్నది. సరే అని నా స్నేహితుడు కిషోర్ చెప్పగా నేను సికింద్రాబాద్ లో ఉన్న గ్రాద్యుఎత్ తిలోర్స్ దగ్గరకి వెళ్ళా. ఆ షాపు వాడికి "వస్త్ర శిల్పి" అని పేరు కూడా ఉంది. ఇంత నా బట్టలు ఇచుకున్నకా , వాడు చావు కబురు చల్లగా , నా బట్టలు ౨౦ తేదీన ఇస్తాను అని చెప్పాడు. ఇంకా చేసేది ఏమి లేక అన్ని మూసుకుని నడిచివచ్చేసా. సశేషం...........