Skip to main content

Posts

Showing posts from 2009

జీవితంలో మలుపు

మళ్ళా చాలా రోజుల తరువాత నేను రాస్తున్న. ఈ మధ్య కాలంలో నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది . నాకు అబ్బాయి పుట్టాడు. వాడికి ముద్దుగా ఆశ్రిత్ అని పేరు పెట్టుకున్నాము. నా జీవితంలో చాల ఆనందదాయకమైన రోజు అక్టోబర్ ౨౩. రకరకాల భావాలతో ఉన్నాను. ఒక పక్క చాల సంతోషం, మరో పక్క చాల ఆశ్చర్యం - నేను కూడా తండ్రి అయ్యాను అని. ఇప్పటికి రెండు నెలలు పైన గడిచాయి వాడు పుట్టి. రోజూ వాడు చీసే చేష్టలతో నాకు రోజుకో రకమైన కొత్త అనుభవం. ఇంకా ముందు ముందు ఎలా మారనున్నదో కాలమే చెప్తుంది. అంతవరకు మీరందరూ మా చిట్టి గాడి చిత్రాలు ఇందులో తిలకించండి. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ చూడండి http://picasaweb.google.com/saikvv/Aashrit02 #

ఎవరిగోల వారిది

మళ్ళీ చాలా రోజుల తరవాత రాస్తున్న. ఈ మధ్య మా కంపెనీ ని కాగ్నిజెంట్ అనే ఐ టి కంపెనీ కొనుక్కుంది. అసలు ఆ మొత్తం కార్యక్రమం ఆఫీసు లో చాల మందికి మంచి పిచ్హా పాటి వేసుకోవడానికి ఆస్కారం కలిపించింది. రోజు అసలు ఏ కంపెనీ మమ్మల్ని కొంటుందో అని మంచి ఉత్కంఠ భరితమైన కథ లాగ సాగింది వ్యవహారం. మొత్తానికి ఐ బి నుంచి ఐ టి కంపెనీ కి మారాము. ఈ సంగతి చాల మందికి మింగుడు బడడం లేదు . ఎక్కడికైనా పోదామా అంటే ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు . ఇది చిన్న ఉద్యోగుల వరస, ఇక పెద్ద ఉద్యోగులు మాత్రం నెమ్మది గ చాప కింద నీరులా జారుకుంటున్నారు. ఇక మా సంగతి కి వసతీ అటు మింగలేక ఇటు కక్కలేని పరిస్తితి. ఎక్కడ మాకు ఉద్యోగాలు ఇచ్చేయ్ నాదుడే లేడు. దీనికి తోడు మా మేనేజర్ గాడి గోల, వాడి తెలివి తేటల ప్రదర్సన మా మీద. మొత్తానికి ఎవరిగోల వారిది లాగ ఉంది .