మొత్తానికి కదిలింది బ్రహ్మ రథం! అని అనుకున్నారు నా స్నేహితులు మరియు బంధు ప్రజానీకం . ఏమిటా అని అనుకుంటున్నారా , నేను మొత్తానికి విమానమెక్కి విదేశాలకి పయనించా. చాల మంది నా జీవితంలో నా జన్మ భూమిని దాటాను అని అనుకున్నారు. అందులో వారి తప్పు ఏమి లేదు. నా ప్యాంటు కిందకి ముప్పయ్ ఏళ్ళు వచినా నా మొహాన్న పాస్స్పోర్ట్ మాత్రాం లేదు కదామరి !!అందుకని అందరు నేను కచిచితంగా ఇక్కడే పాతుకుని ఉంటాను అని అనుకున్నారు. కాని నా సహధర్మ చారిణి ( నా పెళ్ళాం) మాత్రాం ఊరుకోలేదు. ప్రతీసారి వచ్చిన అవకాశాలన్నీ ఇలాగే నేను జారవిడుచుకోవడం తనకి నచచలేదు. మొత్తానికి పట్టు పట్టి పాస్స్పోర్ట్ సంపాదించుకున్న. ఇన్నాళ్లూ తలకిందుల తపస్సు చేసిన అవ్వని పని మొత్తానికి అయ్యింది. బతుకు జీవుడా అనుకున్నా. ఇక గతంలో అన్నీవిపరీతాలు జరిగాయి అని నేను చెప్పినట్టు, నా విదేశీ ప్రయాణం కూడా ఒక విపరీతమే. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంత ఆర్ధిక సంక్షోభం వచ్చి తల్లకిన్దులైపొతో ఉన్నఈ సమయమ్లో, అసలు ఉద్యోగం ఉంటుందో , ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో, అన్నీ కంపెనీల వారు కాస్ట్ కట్టింగ్ చేస్తున్న ఈ సందర్భంలో , మా కార్యాలయం వారికి ఒక అద్భతమైన ఆలోచన వచ్చింది , ...
అంతా తెలుగు మయం ......