మళ్ళీ మన భాష గురించి కొంచెం రాద్దామని ................ ఇటీవల కాలం లో మన తెలుగు పలు మార్పులకు గురి అయ్యింది. అసలు భాష మాట్లాడడానికి రాకపోగా మనం ఇతర భాషల నుంచి పదాలను తర్జుమా చేసుకుంటున్నాము... మన తెలుగు పదాలు చాల మతుక్కు ఇప్పటికే మనం మర్చిపోయాము. .. ఇక రాను రాను మన పరిస్తితి అదేదో సామెత చెప్పినట్టు " రాను రాను రాజు గారి గుర్రం గాడిద అయ్యిందట" .. అలా తయారవ్తోంది... ఈ మధ్యనే పాండురంగడు అని ఒక గొప్ప చిత్రం చూసా. అది భక్తి చిత్రమా లేక రక్తి చిత్రమా అని అర్ధం అయ్యేట్టప్పడికి చిత్రం అయిపోయింది. మా స్నేహితుడు చెప్పినట్టు దీనికి పూలరంగడు అని పేరు పెట్టాల్సింది అన్నాడు. ఐతే ఇక అసలు విషయానికి వస్తే , ఈ చిత్రం లో సంభాషణలు , నారదులు వారు ఒక సారి "మీకు అంత సన్నివేశము లేదు " అని అంటారు. ఇది మామూలుగా మన చిత్రాల్లో వినే " నీకంత శీను లేదు" అనే మాటని అనువదించారు... అలాగేయ్ " కాస్త విభిన్నంగా ఉంటుంది అని" అనేది మనం వినే "కాస్త వెరైటీ గ ఉంటుంది అని" అనే మాటని మార్చేసారు .......ఇంక " ఉట్టి పగులుతుంది" అనే మాట " బాక్స్ బద్దలవ్తుంది" అనే మ...
అంతా తెలుగు మయం ......