ఈ మధ్య గత రెండు రోజులుగా మన రాష్ట్రమంతటా ఆకాశ ప్రకంపలనికి గురయ్యింది. అసలు వానలు కురవట్లేదు అనుకుంటున్నా సమయంలో విపరీతమైన వానలతో ఒక ఊపు ఊపేసింది. అంత అల్లా కల్లోలం ఎక్కడ చూసిన గందర గోళం . అసలు దీనికి కారణం ఏమయ్యుంటుంది .........? మన వాళ్లు చేసిన వరుణ పూజలు, హోమాలా? లేక అల్ప పీడనమా? లేక దశావతారం సినిమా లో చూపించినట్టు ఏదో గొప్ప ప్రమాదాన్ని తప్పించటానికి దేవుడు చేసిన లీలా? ......... వీటిలో ఏదో ఒకటి కారణం అయ్యుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటెయ్ మీరు పప్పు లో కాలు వేసినట్లే. దీనికి కారణం నీను చిట్ట చివరకు నా పాస్స్పోర్ట్ అప్లై చెయ్యగలిగాను. ఇది ఒక కారనమేనా అని మీరంతా విస్తు పోతే చెప్తా చదవండి.... ఇది వరకు నేను నా ఆంగ్ల "ఈ - శీర్షిక" లో చెప్పినట్టు , నేను కారు కొందామనుకుంటే అప్పుడు లోను ధరలు పెరిగినాయి.. అలాగే కొన్న తరువాత పెట్రోల్ ధరలు పెరిగాయి, ఇదే విధంగా నేను మా కంపెనీ UBS లో జాయిన్ ఐన తరువాత , ఆ కంపెనీ కి దాని చరిత్ర లో ఎప్పుడు రానంత నష్టాలు వచ్చాయి. అదే విధంగా నేను ఈ యేడాది మొదలులో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టా, వెంటనే స్టాక్ మార్కెట్ పతనమైపాయింది . అప్పటి నుంచి ఇప్పటి దాక ...
అంతా తెలుగు మయం ......